బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది. 2021లో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి బోయపాటి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ‘ఆఖండ-2’ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ బాలకృష్ణ ఫ్యాన్స్‌కే కాదు.. చాలా మంది సినీ అభిమానులకు నచ్చింది.
తాజాగా దసర సందర్భంగా చిత్ర యూనిట్ మరో కానుకను ఇచ్చింది. టీజర్ విడుదల చేసినప్పుడు దసరా కానుకగా ెప్టెంబర్ 25 తేదీకి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయిత కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు ఓ కొత్త పోస్టర్‌ని కూడా వదిలింది. ఇందులో బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది.