అహ్మదాబాద్: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌కి భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ చుక్కలు చూపిస్తున్నాడు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ టి చంద్రపాల్(0) ధృవ్ జురేల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి క్యాంప్‌బెల్(8) కూడా జురేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక సిరాజ్ వేసిన 10వ ఓవర్ ఆఖరి బంతికి బ్రాండన్ కింగ్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఇక సిరాజ్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి అలిక్ అథనాజ్(12) కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 ముగిసేసరికి వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజ్‌లో షాయ్ హోప్(0), రోస్టన్ ఛేజ్ (0) ఉన్నారు.