మన తెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చేసిన కృషి, పడిన తపన గురించి బిసిలకు వివరించేందుకు దసరా పండుగ త ర్వాత ‘బిసి గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ ని ర్వహించాలని సిఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మ హేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో సమావేశమయ్యా రు. స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్థానాలను కై వసం చేసుకోవాలని మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. జెడ్‌పిటిసి అభ్యర్థుల జాబితాను ఈ నెల ఏడవ తేదీన ప్రకటించే విధంగా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బిసి రిజర్వేషన్లపై కోర్టులో దాఖలైన కేసు, ఈ నెల ఎనిమిదిన విచారణ, ఈ కేసులో పార్టీ బిసి నేతలతో ఇం ప్లీడ్ పిటిషన్ దాఖలు చేయించడం, జడ్‌పిటిసి పదవులకు పోటీ
చేయాలనుకుంటున్న ఆశావాహులతో జాబితా సిద్ధం చేసుకోవడం ముఖ్యంగా బిసిల కోసం తాము పడిన కష్టాన్ని, తీసుకున్న చర్యల గురించి బిసిల్లోకి మరింతగా తీసుకెళ్ళాల్సిన అంశంపైనా వారు చర్చించారు. బిసిల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారు రాజకీయంగా పైకి ఎదగాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్త్తున్న కృషిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగా బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ విషయంపై బిసి మంత్రులు, ఎమ్మెల్యేలతో మరోసారి ప్రత్యేకంగా సమావేశమై బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలి ?, ఏ తేదీన నిర్వహించాలి ? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనసభ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన మేరకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై తిరిగి కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నప్పటికీ భారీ వర్షాల కారణంగా వాయిదా వేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. బీసీ గర్జనను కామారెడ్డిలోనే నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అయినట్టు తెలిసింది. ఈ అంశంపై అందరితో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
5వ తేదీ వరకు పిసిసికి
ఆశావాహుల జాబితా
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్నందున ఏడవ తేదీన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 5 వ తేదీకల్లా ఆశావాహుల జాబితా సిద్ధం చేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేయాలని జిల్లా ఇంచార్జీ మంత్రులకు, జిల్లా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం మరోసారి గుర్తు చేసారు. అయితే ఆశావాహులు ఎంతమంది ఉన్నప్పటికీ వడబోసి ఒక్కో స్థానానికి ముగ్గురు పేర్ల చొప్పున మాత్రమే పంపిస్తే ఎంపికకు సులువు అవుతుందని సీఎం సూచించినట్లు తెలిసింది. వడబోతలో ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీకి వారు ఏ మేరకు సేవలందించారు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. చడం జరిగింది. విజయావకాశాలు మెండుగా ఉన్న అభ్యర్థుల పేర్లనే పిసిసి అధ్యక్షుడికి పంపించాలని సూచించారు.
ఎంపిటిసి అభ్యర్థుల ఎంపిక జిల్లా నేతలే..
ఇదిలాఉండగా ఎంపిటిసి అభ్యర్థుల ఎంపిక బాధ్యత జిల్లా నేతలదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. అభ్యర్థులను ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగాలని, ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేసినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేసే నాయకులు, కార్యకర్తలనే ఎంపిక చేయాలని, పైరవీలకు ఛాన్స్ ఇవ్వరాదని పార్టీ రాష్ట్ర నాయకత్వం జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, డీసీసీ ముఖ్య నేతలకు సూచించినట్టు సమాచారం. పైరవీలకు ఆస్కారం ఇవ్వవద్దని, పార్టీకి వారు అందించిన సేవలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని మహేశ్‌కుమార్ గౌడ్ సూచించినట్టు తెలిసింది.