మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వరం ప్రా జెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం ని ర్ణయించింది. వాటి పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రా జెక్టులో భాగమైన ఈ మూడు కీలక బ్యారేజీల పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవక లు, అక్రమాలు, డిజైన్ లోపాలపై ఇప్పటికే రా ష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్‌లకు ఆహ్వానం పలకడం విశేషం. ఆ మూడు బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎం పిక చేసేందుకు టెండర్‌లను ఆహ్వానించింది. దీంతో గతంలో ఎన్‌డిఎస్‌ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రుపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు గ డువు ఇచ్చింది. బ్యారేజీల పునరుద్ధరణకు ఈఓఐ పిలవాలని,
మేడిగడ్డ, అన్నారం, సుం దిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కో రుతూ ప్రభుత్వం జాతీయ స్థాయిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈఓఐ పిలవాలని నీటిపారుద ల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డిఎస్‌ఏ) సిఫార్సుల మేరకు ఈ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. దీని ప్రకారం, వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రభుత్వం ఈఓఐ కోరింది.
వరద ప్రవాహం తగ్గిన తరువాత
బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డిఎస్‌ఏ ) తన రిపోర్టులో పేర్కొనగా ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అదే సమయంలో తుమ్మిడిహట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మిస్తామని ప్రభత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే వర్షా కాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం వరదల కారణంగా వర్షాకాలం తర్వాత చేయాల్సిన పరీక్షలకు ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి డిసెంబర్ లేదా జనవరి వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సమయం వృథా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకెళ్తోంది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములను చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ ప్రక్రియలు పూర్తయ్యేలోగా మూడు బ్యారేజీల్లో పరీక్షలు పూర్తవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈనెల 15వ తేదీ సాయంత్రం ఏజెన్సీ ఎంపిక
2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాయగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించింది. ఈ కమిటీ గత ఏడాది మే నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సహా అనేక వైఫల్యాలున్నట్లు గుర్తించింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని, అలా చేస్తే మరింత నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఈ మేరకు కొన్ని డిజైన్లు, డ్రాయింగ్‌లను సూచించింది. ఈ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణ, రెస్టోరేషన్ డిజైన్ల కోసం ప్రసిద్ధ డిజైన్ ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను ఆహ్వానించింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి డిజైన్ ఏజెన్సీలు తమ ప్రతి పాదనలను సీల్డ్ చేసిన కవర్‌లో ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జలసౌధ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ కవర్లు ఓపెన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియలో ఎంపికైన ఏజెన్సీలు ఎన్‌డిఎస్‌ఏ కమిటీ సూచనల మేరకు బ్యారేజీల పునరుద్ధరణ డ్రాయింగులు, డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.