మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రెండేళ్లలో 700కు పైగా అన్నదాతల బలవన్మరణాలు జరగడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో, ముఖ్యమంత్రిగా కే సీఆర్ అమలు చేసిన ’రైతు బంధు’ వంటి పథకాల తో తెలంగాణ రైతుల జీవితాల్లో స్వర్ణయుగం నెలకొందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. కేసీఆర్ సుపరిపాలన వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు దేశంలో అత్యధికంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలే రుజువు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నా రు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలోని వివరాలను ఉటంకించారు. అద్భుతమైన ప్రగతిని సాధించిన తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పరిస్థితి తారుమారైందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన ముగిసే నాటికి 56 ఆత్మహత్య లు నమోదైతే,’
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత కేవలం రెండేళ్లలోనే సుమారు 700కు పైగా అన్నదాతల బలవన్మరణాలు నమోదయ్యాయి. ఇ ది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అమానవీయ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్‌సిఆర్‌బి ని వేదిక ప్రకారం పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాం లో రైతుల ఆత్మహత్యల తగ్గింపు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే నమోదైందని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1, 347 గా ఉంటే, కేసీఆర్ పాలన ముగిసే నాటికి, 2023 నాటికి ఆ సంఖ్య కేవలం 56కు తగ్గిందని చెప్పా రు. అంటే, రైతుల బలవన్మరణాల్లో 95.84 శాతం తగ్గుదల నమోదైందని వివరించారు. అలాగే, 2014లో దేశంలోని మొత్తం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 10.9 శాతంగా ఉండగా, 2023 నాటికి అది కేవలం 0.51 శాతానికి తగ్గిందని తెలిపారు. ఈ గణాంకాలు కేసీఆర్ పాలన సుపరిపాలనకు, మానవత్వంతో కూడిన పాలనకు నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు.
రైతు సంక్షేమ పథకాలే కారణం
రైతుల ఆత్మహత్యలు ఇంత భారీ స్థాయిలో తగ్గడానికి కారణాలను కేటీఆర్ వివరిస్తూ తాము అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు, యుద్ధప్రాతిపదికన సృష్టించిన సాగునీటి సౌకర్యాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి అంశాలన్నీ ఫలించాయని తెలిపారు. ఇవి రైతు సమాజంలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చాయని వివరించారు. ఈ అద్భుతమైన ప్రగతిని చూసి తాను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ‘పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండి రైతుల ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశమంతా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే తెలంగాణ ఇది చేయగలిగితే, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఏ ఒక్క రైతు కూడా చనిపోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా ఉండేలా చూసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటను అనుసరించాలని ఆయన అన్నారు. చివరగా రైతులు చల్లగా, నూరేళ్లు వర్ధిల్లి, సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మార్పును సాధ్యం చేసి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన కేసీఆర్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.