ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, కంచల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న పోలీసు బలగాలు బుధవారం భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి ఆపరేషన్ కగార్‌లో భాగంగా అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా మావోలకు చెందిన భారీ డంప్‌ను బలగాలు కనుగొన్నాయి. కంచల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ సొరంగాన్ని కనుగొన్నాయి. అందులో మావోలకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది. అదేవిధంగా గ్రనేడ్ లాంచర్లు, గన్ పౌడర్, డిటోనేటర్లు, ఇన్వర్టర్లు, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున ఉన్నాయి. వీటితో పాటు ఆర్‌డిఎక్స్ రైఫిల్ బయోనెట్‌లు, ఇనుప రాడ్లు, కట్టర్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే భద్రతా బలగాలు కనుగొన్న డంప్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదని పోలీసు అధికారులు వెల్లడించారు.