ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి నేడు వెళ్లనున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గం కొండగల్‌లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం మహాత్మగాంధీ జయంతి సందర్భంగా నగరంలోని బాపూ ఘాట్‌లో ముందుగా సిఎం రేవంత్ నివాళులర్పిస్తారు. అనంతరం కొండారెడ్డిపల్లికి బయలుదేరి అక్కడ గ్రామస్థులతో కలిసి దసరా పండుగను జరుపుకుంటారు. గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొడంగల్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ముచ్చటించి రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి నియోజవకర్గ ప్రజలు, కేడర్‌తో మమేకం కానున్నారు. స్థానిక సంస్థల వేళ వ్యవహారించాల్సిన తీరుపై సిఎం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.