మాస్ మహరాజ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా ఓ ఫన్నీ వీడియోతో ఈ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ వీడియోలో రవితేజను హైపర్ ఆది సినిమా విడుదల తేదీ గురించి పలు మార్లు అడగటం.. దానికి రవితేజ సమాధానం చెప్పడం చూడొచ్చు. ఆఖరిగా వినాయక చవితి కూడా అయిపోయింది అంటూ వినాయకుడి విగ్రహంతో ఆది వస్తాడు.. అయితే ఆ వినాయకుడిపై ప్రమాణం చేస్తూ.. అక్టోబర్ 31వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు రవితేజా ప్రకటిస్తాడు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి ప్రేక్షకాదరణ లభించింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ‘మాస్ జాతర’ సినిమా చెప్పిన టైమ్‌కి విడుదలై.. ప్రేక్షకులకు జాతర చూపించాలని కోరుకుంటున్నారు.