మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఇందులో చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.దసరా పండగ సందర్భంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీలో ఆమె చేస్తున్న శశిరేఖ పాత్రను పరిచయం చేస్తూ కొద్దిసేపటిక్రితమే పోస్టర్ ను విడుదల చేశారు.
ఇందులో నయన్.. ఎల్లో చీరలో కుర్చిపై గొడుగు పట్టుకుని కుర్చుకున్న ఫోటో ఆకట్టుకుంటోంది. అలాగే,రేపు సర్ ప్రైజ్ కు సిద్ధం కండి అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ పేర్కొన్నారు. దీంతో రేపు మరో చిరు, నయనతార కలిసి ఉన్న మరో పోస్టర్ లేదా లిరికల్ సాంగ్ ఏమైనా మేకర్స్ ప్లాన్ చేశారా? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, చిరు పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.