అందాల భామ మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూ టింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో 2026 సంక్రాంతికి భా రీ విజయం ఖాయం అని ఆమె ధీమాతో ఉందట. అయితే తెలుగులో కొత్త సినిమాలకు సున్నితంగా నో చెబుతున్న మీనాక్షి చౌదరి హిందీలో మాత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్‌లో నటించాలని కోరుకుంటున్నారు. కనుక మీనాక్షి చౌదరి సైతం బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని ఆశ ప డుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో మీనాక్షి చౌ దరి ఎంట్రీకి రంగం సిద్దమైంది. జాన్ అబ్రహం హీ రోగా నటిస్తున్న ఫోర్స్ ప్రాంచైజీ మూడో పార్ట్‌లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించిన మేకర్స్ సంతృప్తి చెందలేదని, సౌత్ కి చెందిన హీరోయిన్స్‌లో నూ ఇద్దరు ముగ్గురిని పరిశీలించి చివరకు మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. భావ్ ధులియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతోంది. మరి ఈ సినిమాతో ఆమెకు హిట్ దక్కేనా చూడాలి.