తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి మరో వివాదంలో చిక్కుకున్నారు. పనిమనిషిపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆమెపై ఫిల్మ్ సిటీలో కేసు నమోదు అయ్యింది. తమ ఇంట్లో కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని పిలిపించి.. తమపై డింపుల్ హయాతి, ఆమె భర్త వేధింపులకు పాల్పడ్డారని ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నటి తన భర్తతో తిట్టించిందంటూ ఆరోపించారు.
“మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు ఎంత మీ బ్రతుకు ఎంత” అంటూ హయాతి భర్త తిట్టారని.. “మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ పీకలేరని”.. డింపుల్ హయాతి, జీతం డబ్బులు కూడా ఇవ్వకుండా ఇంట్లో నుండి వెళ్లగొట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు తమను చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు డింపుల్ హయాతితో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. కాగా గతంలోనూ ఓ ట్రాఫిక్ పోలీసు అధికారితో డింపుల్ హయాతి గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే.