తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం దసరా సెలవులు ఉండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక, మంగళవారం వెంకన్నను 73,275 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 21,973 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.