మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూ ప్రకంపనలతో దాదాపు 31 మందికి పైగా మరణించగా.. అనేక మంది గాయపడినట్లు తెలిపారు. అలాగే పలు భవనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనలతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు పెట్టారు. తీవ్రమైన ప్రకంపనల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
సెబు ప్రావిన్స్‌లోని బోగోకు ఈశాన్యంగా 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 90,000 మంది జనాభా నివసించే ఈ తీరప్రాంత నగరంలో 14 మంది మృతి చెందినట్లు విపత్తు-ఉపశమన అధికారి రెక్స్ వైగోట్ అసోసియేటెడ్ చెప్పారు. బోగోలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ భూ ప్రకంపనలు కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో కొంతమంది మరణించగా.. మరికొంతమంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.