మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు ట్రోఫీని అందించిన స్టార్ ఆటగాడు తిలక్‌వర్మ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశాడు. అతను తన చిన్ననాటి కోచింగ్ సెంటర్ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్‌ను సందర్శించాడు. అనంతరం అక్కడ విలేకరులతో ముచ్చటించిన తిలక్ వర్మ ఆసియాకప్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నాడు. ఇలాంటి స్థితిలో ఆసియాకప్‌లో దాయాదిల మధ్య జరిగిన మ్యాచుల్లో ఘర్షణ వాతావరణం స్పష్టంగా కనిపించిందన్నాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల పిల్ల చేష్టలకు తాము విజయంతో జవాబిచ్చామన్నాడు. పాక్ క్రికెటర్లు కవ్వింపు చర్యలకు పాల్పడిన తాము భయపడలేదన్నాడు. వారికి తాము బ్యాట్‌తో గట్టి సమాధానం ఇచ్చామన్నాడు. పాక్‌తో జరిగిన ఫైనల్‌లో తాము ఒక దశలో ఒత్తిడికి గురయ్యమన్నాడు. కీలక సమయంలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి నెలకొందన్నాడు. దీన్ని అసరగా తీసుకున్న పాక్ ఆటగాళ్లు పిల్లచేష్టలకు దిగారన్నాడు. వారు భారీ ఎత్తున స్లెడ్జింగ్‌కు దిగారని, అయినా తాము మాత్రం ఉద్రేకాని గురికాలేదన్నాడు. వారు ఎంత రెచ్చగొట్టిన తాను మాత్రం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టానని వెల్లడించాడు. అనవసరంగా ఆవేశానికి గురై..చెత్త షాట్ ఆడితే వికెట్ కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నాడు. దీంతో తాము సంయమనం పాటించి ముందుకు సాగామన్నాడు. చివరికి విజయం సాధించి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చామని తిలక్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది చిరకాలం తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందన్నాడు.