గువాహటి: భారత మహిళ జట్టు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తమ ప్రతిభ కనబరిచేందకు సిద్ధమవుతోంది. ఐసిసి వన్డే ప్రపంచకప్-2025 మంగళవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో అతిథ్య దేశాలు భారత్-శ్రీలంక తలపడుతున్నాయి. బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నమెంట్‌ని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తుది జట్లు:
భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లిన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిక్స్, రిచా ఘోష్(కీపర్), దీప్తీ శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ ఛారణి.
శ్రీలంక: చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర.