ఆసియాకప్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టోర్నమెంట్‌లో పూర్తి ఆదిపత్యం చూపించిన సూర్యకుమార్ సేన.. చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో భారత్ మూడుసార్లు తలపడింది. మూడుసార్లు భారత్‌దే పైచేయి. మ్యాచ్‌లో ఓడిపోతున్నా.. పాక్ ఆటగాళ్లు వెకిలి చేష్టలు మానలేదు. ముఖ్యంగా పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ చాలా ఓవరాక్షన్ చేశాడు. చివరకు అతని ఓవర్‌లోనే ఇండియా చితక్కొట్టి విజయం సాధించింది.
ఈ మేరకు పాక్ బౌలర్ హరిస్ రౌఫ్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైర్లు వేశారు. ఫైనల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించిన అశ్విన్, రౌఫ్‌పై విమర్శలు చేశారు ‘‘తిలక్ వర్మ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్లిష్ట సమయలో ఒత్తిడిని తట్టుకొని చక్కగా రాణఇంచాడు. మేం చాలా తేలిగ్గా మ్యాచ్ గెలిచాం. ఇందుకోసం ఒకరికి ధన్యవాదాలు చెప్పాలి. అతనే హరిస్ రౌఫ్. అతని బౌలింగ్ వల్లే మా విజయం తేలిక అయింది’’ అని అశ్విన్ రౌఫ్ గురించి అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో రౌఫ్ ఘోరంగా విఫలమయ్యాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు.