న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి సెలబ్రిటీలకు నోటీసులు పంపి.. విచారిస్తోంది. కొద్ది రోజుల క్రితమే (సెప్టెంబర్ 15) నటి ఊర్వశీ రౌటెలాకు బెట్టింగ్ యాప్‌ల కేసులో ఇడి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె మంగళవారం (30-09-25) ఇడి విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం, వాటితో ఆమెకున్న సంబంధం, తీసుకున్న పేమెంట్స్ తదితర విషయాలపై ఊర్వశీని అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రిటీలను విచారించిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మీ, సురేష్ రైనా, సోనూ సూద్ ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.