పెద్దపల్లి: సుల్తానా బాద్ మండలం సుద్దాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సుల్తానా బాద్ మండలం సుద్దాల వద్ద జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం మృతులను సుల్తానా బాద్ కు చెందిన అభి, రాకేష్ గా పోలీసులు గుర్తించారు.