వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సినిమా రం గంపై టారిఫ్‌ల కొరడా ఝళిపించా రు.విదేశీ సినిమాలపై 100%సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారంనాడు తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో వెల్లడించా రు. అమెరికాలో నిర్మించే చిత్రాలను ఈ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ నిర్ణయం తో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సహా భారతీయ సినిమాలన్నింటిపై వందశాతం సుంకాల భారం పడనుంది. ‘మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి పలు దేశాలు దొంగిలించాయి. చిన్న పిల్లవాడి చేతిలోని క్యాండీని దొంగిలించినట్లుగా ఆయా దేశాల వ్యవహారశైలి ఉంది. దీర్ఘకాలికి, ఈ నిరంతర సమస్యను పరిష్కరించేందుకు
అమెరికా బయట నిర్మించే సినిమాలపై 100శాతం టారిఫ్‌లు విధిస్తున్నా. ఇక అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిన్నది. ఆయన వల్ల ఈ సమస్య వచ్చి పడింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ సుంకాల అమలు ఎప్పటి నుంచి చేయబోయేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ట్రంప్ నిర్ణయంతో టాలీవుడ్‌పైనా తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా వ్యాప్తంగా సుమారు 700కుపైగా సినిమా థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటాయని సమాచారం. ఉదాహరణకు ఒక సినిమా పంపిణీదారుడు రూ.5కోట్ల విలువతో హక్కులను కొనుగోలు చేస్తే దానికి అదనంగా మరో రూ.5కోట్లు సుంకం రూపంలో చెల్లించాల్సి వస్తుంది. తద్వారా అదనంగా రూ.5కోట్ల భారం పడబోతోంది. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమా రంగంపై పెను ప్రభావం ఉండే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. హాలీవుడ్‌కు పునర్వైభవం తీసుకొచ్చేందుకే ట్రంప్ ఈ నిర్ణయానికి ఒడిగట్టి ఉంటారని పేర్కొంటున్నారు.