న్యూఢిల్లీ: లారెన్స్ బిష్ణోయ్, ఆయన ముఠాను కెనడా తన క్రిమినల్ కోడ్ ప్రకారం ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించినట్లు ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనందసంగరీ సోమవారం సాయంత్రం తెలిపారు. అనగా ఆ దేశంలోని ఏదైనా బిష్ణోయ్ ముఠా ఆస్తి, నగదు, వాహనాలను స్తంభింపజేయవచ్చు లేదా స్వాధీనం చేసుకోవచ్చు. వివిధ నేరాల కింద గ్యాంగ్ సభ్యులను విచారించేందుకు కెనడా చట్ట అమలు సంస్థలకు మరిన్ని అధికారాలు ఇస్తుంది.
కెనడాలోకి అనుమానిత గ్యాంగ్ సభ్యులను రాకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించవచ్చు. బిష్ణోయ్ గ్యాంగ్ నియంత్రిత ఆస్తులను తెలిసి కొనడం అన్నది ఇక కెనడా పౌరులకు నేరమే కాగలదు. ప్రస్తుతం ఇండియా, కెనడా దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదివరలో జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.