కాకినాడలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు… కారును వెంబడించి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఐదుగురు పరారైనట్లు తెలుస్తోంది. ఇక, కారులో తరలిస్తున్న 384 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ.29 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే.. కారు, నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని వైజాగ్ నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ బింధుమాధవ్ తెలిపారు.