యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లగా నటిస్తున్నారు. సలార్ వంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ తొలిసారి ఈ జోనర్ లో నటిస్తుండటంతో మూవీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడదల చేశారు.ఇందులో భారీ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా అదిరిపోయింది. చాలా గ్రాండీయర్ గా ఉన్న ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ లో మేకర్స్ ప్రకటించారు.