దుబాయ్: ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచిదంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా ట్రోఫీని భారత్ తొమ్మిదోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్, భారత్‌ల మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగితే.. మూడుసార్లు విజయం భారత్‌నే వరించింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌తో మధ్య జరిగే మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరు జట్లు తలపడ్డాయి.
అయితే తలపడిన తొలి మ్యాచ్‌లో భారత ఆటగాలళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని పాక్ ఆటగాళ్లు రాద్ధాంతం చేశారు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఇది ఫైనల్స్‌లో తారాస్థాయికి చేరింది. పాకిస్థాన్‌కు ఎసిసి అధ్యఖ్సులు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో అతడు కోపంతో ట్రోఫీని.. భారత ఆటగాళ్లకు ఇచ్చే మెడల్స్‌ని తీసుకొని వెళ్లిపోయాడు. అయితే ఇక్కడే అసలు కథ జరిగింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తన ఫీజు మొత్తం పహల్గాం బాధితులకు, సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
దీంతో సూర్యకుమార్ తీసుకున్న నిర్ణయంపై భారతదేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. అయితే సూర్య నిర్ణయాన్ని కాపీ కొడుతూ.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా వ్యవహరించాడు. ‘ఆపరేషన్ సింధూర్’లో మరణించిన వారి కుటుంబాలను తన ఫీజు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఆపరేషన్ సింధూర్’లో మరణించింది ఉగ్రవాదులే అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ.. సల్మాన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.