ఆసియాకప్-2025 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును టీం ఇండియా మేనేజ్‌మెంట్ ప్రధానం చేస్తుంది. ఈ మేరకు ఫైనల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి శివమ్ దూబేకి ఈ అవార్డు దక్కింది. టీం ఇండియా సహాయక బృందంలోని ఫిజియోథెరపిస్ట్ కమలేశ్ జైన్ ఈ అవార్డు తాలుక మెడల్‌ను దూబేకు అందించారు.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో తొలి రెండు ఓవర్లలో దూబె పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ 33 పరుగులు చేసి జట్టును గెలిపిచడం కోసం కృషి చేశాడు. దీంతో దూబేకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు దొరికింది. ఈ అవార్డు అందుకున్న సమయంలో దూబే మాట్లాడుతూ.. తనకు ఎంతో సంతోషంగా ఉందని.. తొలి ఓవర్ బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్‌కు, కోచ్ గౌతమ్ గంభీర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడానికి చాలా ఒత్తిడికి గురయ్యానని.. భయపడ్డానని అన్నాడు. కేవలం బౌలింగ్‌పైనే దృష్టి పెట్టడంతో మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఒత్తిడి తగ్గిందని పేర్కొన్నాడు.