హైదరాబాద్: ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా పేదలకు నాణ్యమైన భోజనం, టిఫిన్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతీనగర్ లో ఇందిరమ్మ క్యాంటీన్లు పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోతీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. జిహెచ్ఎమ్ సి లో 60 క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని, ఇకపై రూ.5 బ్రేక్ ఫాస్ట్ అని తెలియజేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్థానాల్లో తామే గెలుస్తామని, ఎమ్ఎయుడి, హెచ్ఎమ్ డిఎ అవినీతి జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివి ఉంటే తన దృష్టికి తీసుకురండని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.