తెలంగాణా అస్తిత్వం- సృజనరంగం-8
ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభి ప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈ సారి బాల గాయినిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, గత యాభయ్యేళ్లుగా తన ప్రస్థానాన్ని నిరంత రాయంగా కొనసాగిస్తున్న ప్రముఖ ప్రజా కళాకారిణి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌర వాధ్యక్షురాలు, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో సంస్కృతిక రంగంలో ముఖ్య భూమికను నిర్వహించిన నాయకురాలు విమలక్క అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్‌లో.
తెలంగాణ అస్తిత్వం అంటే అది కేవలం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు. తెలంగాణ ఉత్పత్తి, జన జీవితం, సంఘర్షణ క్రమంలో అది రూపొందింది. సర్వాయి పాపన్న ద్వారా బహుజన రాజ్యాధికారం కోసం, అలాగే తెలంగాణ సాయుధ పో రాటం ద్వారా ప్రజారాజ్యాధికారం కోసం, ప్రాంతీయేతరుల అంతర్గత వలస దోపిడీని వ్యతిరేకించే ప్రాంతీయ ప్రజాస్వామ్యం కోసం (Regional emocracy) జరిగే పోరాటాల్లో భూస్వామ్య వ్యతిరేక వర్గ-కుల పోరాటాల్లో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది. సమ్మక్క, సారమ్మల త్యాగం నుండి సాహసంగా, ప్రతాపరుద్రుని ఆత్మార్పణ నుండి ఆత్మగౌరవంగా ప్రారంభమై కొనసాగుతున్న పోరాటాల ప్రతీక. ఇది మిగతా ప్రాంతాలతో సారూప్యతలు కలిగి ఉన్నా, దాని ప్రత్యేకతలు అనేకం, అందుకే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆరు దశాబ్దాలయినా చల్లారకుండా స్వరాష్ట్రమనే ఒక మజిలీకి చేరింది. సర్వసాధారణమైన కుల, జెండర్, మైనారిటీ, పర్యావరణ తదితర అస్తిత్వాలు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంలో కలిసి విశిష్టంగా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత వలసాధిపత్యం నుండి తెలంగాణ విముక్తి, మరికొన్ని పీడిత అస్తిత్వాల విముక్తికి మార్గం సుగమం చేస్తాయి. చేయాలి కూడా.
సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో ఆ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?
రాజులకు కవిత్వాన్ని అంకితమివ్వకుండా పాల్కురికి సోమ న్న నుండి మొదలైన తిరుగుబాటు సాహిత్యం, ఇక్కడి ప్రజా విప్లవ పోరాటాలతో ముడివేసుకుని ధిక్కార కవిత్వంగా, ధిక్కార సంస్కృతిగా మొదలయ్యింది. పనీ పాట అనే క్రమం లో అది పనితోనూ, ఉద్యమాలతోనూ పెనవేసుకుని ఉంది. జానపదుల నోటి నుండి సర్వాయి పాపన్న, పండుగల సాయన్నల తిరుగుబాటు చరిత్రను సంగ్రహించడం అంటే దాని విస్తృతి అర్థమవుతుంది. పని-పాట అంటే కేవలం శ్రమ గానం మాత్రమే కాదు, అది జన జీవన సంస్కృతి. దా నికి పునాది ఆర్థిక, -సామాజిక రంగాలే, ఇది చిన్న రైతు ఉత్పత్తి నుండి పురుడుబోసుకుని భూమితో, గ్రామ దేవతల (Village Deity) ఆరాధనతో ముడిపడి ఉంటుంది. అందుకే భూమి పంపిణీ, స్త్రీ సమానత్వం అనేవి కేంద్ర బిందువులు కావడం ద్వారానే తెలంగాణ ప్రజా ప్రయోజనం నెరవేరిన ట్లు అవుతుంది. సాహిత్య, -సాంస్కృతిక రంగాల విస్తృతి తెలంగాణ సమాజమంతా విశాలమైంది. ఇదే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చడం జరిగింది. శ్రామిక జన ప్రయోజనాల మౌలిక మార్పుల దిశగా ముడి వేసుకోవడమే నేటి అవసరం.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అనేక కొత్త ఆలోచనలతో నూతన ఉత్పత్తులు, కొత్త కొత్త కళాత్మక ఆవిష్కరణలు, సాహిత్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధికి రాజకీయ అవకాశం లభించింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇలాంటి మేథో మధనం జరగనే లేదు.
తెలంగాణ ఉత్పత్తి విధానం (Telangana Mode of Production) నవధాన్య సంస్కృతిని పునాధి చేసుకుని తెలంగాణకు జరిగిన ఆర్థిక-, సామాజిక, -సాంస్కృతిక విధ్వంసాన్ని లెక్కగట్టి, దాని పునర్నిర్మాణం పునాధులపై సృజనాత్మక అభివృద్ధికి పునాధులు వేసుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం, కొన్ని సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్ట డం, కొన్ని సంక్షేమ పథకాలు సరిపోవు. ఇవి అవసరమే. కానీ ఇలాంటి భౌగోళిక తెలంగాణ లేదా సంక్షేమ పథకాల కోసమే వందలాది మంది బలిదా నం చేయలేదు. నూటికి 95శాతం బహుజనులున్న తెలంగాణాలో ఆర్థిక-, సామాజిక సమానత్వం, రాజకీయ అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే అన్ని సృజన రంగా ల్లో సామాన్యులు వాటాదార్లవుతా రు. అలాంటి మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఇంకా ఉంది.
చెరువుల పునరుద్ధరణ, కొండ కోన ల పరిరక్షణ, వాగు వంకల సంరక్షణలతో జలవనరులను కాపాడి తెలంగాణను స్వయం పోషకంగా నిలపడానికి జరిగిన ప్రయత్నాలు సరిపోవు. ఉత్పత్తి రంగాలను బలోపేతం చేసే సేవా రంగాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్యా, -వైద్య రంగాల్లో అది తక్షణం ప్రారంభం కావాలి.
మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగాల్లో, ఎంతో వేగంగా వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరుగుతున్న స్థితిలో ఉంది. తెలంగాణ స్వీయ అస్థిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళారంగాల నుండి మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం సృజనాత్మక రంగాల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమనుకుంటున్నారా?
తెలంగాణ సంస్కృతిలోనే కలగలుపుతనం ఉంది. అది ఎన్నో పర సంస్కృతులను, భాషలను, ఆచార వ్యవహారాలను పనిముట్లను, ఉత్పత్తి సాధనాలను, ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుని గంగా, జమున తెహజీబ్ విలసిల్లుతున్నది. అయితే బయట నుండి చాలామంది ఈ సంస్కృతిలో విలీనమయినారు. కానీ బ్రిటీష్ వలసవాదుల్లాగా ఒక ఆధిపత్య అంతర్గత వలసవాద దోపిడీదారులు ప్రపంచీకరణ దోపిడీ అండతో ఎదిగి తెలంగాణను అంతర్గత వలసగా మార్చారు. ఆధిపత్య సంస్కృతి తెలంగాణపై రుద్దారు.
అందుకే తెలంగాణ పోరాటంలో స్థానికతనే జాతీయత నమూనాగా వెలుగొంది సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటి చెప్పింది. స్థానికతను కలుపుకొని అంతర్జాతీయత ఉండాలి, కానీ స్థానికతను విధ్వంసం చేసి కాదు. ఆ విధ్వంసమే పది ఎకరాల రైతును కూడా బలవన్మరణాల వైపు నెట్టింది. కామ న్ స్కూల్లో చదివిన విద్యార్థులను, సాంస్కృతిక కులంగా ఆశ్రిత కులాలను ఎవరిని వదిలిపెట్టకుండా బలవన్మరణా ల వైపు నెట్టింది. అందుకే స్థా నికత లేదా జాతీయతా పునాధులపై ఆధారపడి ప్రపంచంలోని సృజనాత్మక రంగాలను స్వీకరించాలి. కవిత్వం (Poetry), బాలెట్ (Ballet), స్ట్రీట్ ప్లే లాంటివి మన సాహిత్యం ఏనాడో సంస్కృతిలోనికి చొచ్చుకువచ్చాయి. మంచిని స్వీకరించి, చెడుపై పోరాటం చేయడమే తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి.
తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని ఎత్తిపట్టి రక్షించడంలో విప్లవోద్యమం కీలకమైన పాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవోద్యమం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం విజయపథాన సాగేదే కాదనేది కూడా అతిశయోక్తి కాదు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని వేరువేరుగా చూడలేము. ఈ రెండింటిని ప్రజాస్వామ్యీకరించాలి. అంతరిస్తున్న భాషా, మాండలిక పదాలు, పద బందికలు కాపాడుతూ ఆశ్రిత కుల సమూహాల ద్వారా చరిత్రను సంగ్రహించడం అవసరం. భాషల్లో శిష్ఠ భాషకు పెద్దపీట వేయడం ఆపాలి. సంస్కృత ప్రభావాన్ని తగ్గించాలి. బొమ్మలగుట్ట లాంటి చారిత్రక కట్టడాలను కాపాడటం, జానపద యూనివర్సిటీని నెలకొల్పడం అవసరం.
పల్లె పాట నుండి విప్లవ పాట దాకా అన్నింటినీ కాపాడే పాట నిలయాన్ని నెలకొల్పాలి. ఆశ్రిత కుల సాహిత్యాలను, ఆదివాసీ సాహిత్యాన్ని, ఒగ్గు కథ, బతుకమ్మలాంటి పంటల పండుగను (Harvest festival) ఎత్తి పట్టాలి. భోజనం బోనం అయిన సత్యాన్ని, దాని శాస్త్రీయతను చాటి మూఢ నమ్మకాలను అరికట్టాలి. బతుకమ్మ, బోనాల లాంటి తెలంగాణ పండుగలో అంటరాని కోణాన్ని తరిమివేయాలి.
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంగా గడిచిన 15 ఏళ్లుగా బహుజన బతుకమ్మ ద్వారా సామాజిక అంతరాలను తొలగించడానికి, సహజ వనరులు రక్షించడానికి, నవధాన్య సంస్కృతిని ప్రోత్సహించడానికి జరుగుతున్న మా నిరంతర ప్రయత్నాలను ప్రోత్సహించాలి. దీనిని విప్లవ – ప్రజా సాంస్కృతిక కొనసాగింపుగానే చూడాలి.
తెలంగాణ అస్తిత్వం అంటే అది కేవలం భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు. తెలంగాణ ఉత్పత్తి, జన జీవితం, సంఘర్షణ క్రమంలో అది రూపొందింది. సర్వాయి పాపన్న ద్వారా బహుజన రాజ్యాధికారం కోసం, అలాగే తెలంగాణ సాయుధ పో రాటం ద్వారా ప్రజారాజ్యాధికారం కోసం, ప్రాంతీయేతరుల అంతర్గత వలస దోపిడీని వ్యతిరేకించే ప్రాంతీయ ప్రజాస్వామ్యం కోసం (Regional emocracy) జరిగే పోరాటాల్లో భూస్వామ్య వ్యతిరేక వర్గ-కుల పోరాటాల్లో ఇది మరింత విశిష్టతను సంతరించుకుంది. సమ్మక్క, సారమ్మల త్యాగం నుండి సాహసంగా, ప్రతాపరుద్రుని ఆత్మార్పణ నుండి ఆత్మగౌరవంగా ప్రారంభమై కొనసాగుతున్న పోరాటాల ప్రతీక. ఇది మిగతా ప్రాంతాలతో సారూప్యతలు కలిగి ఉన్నా, దాని ప్రత్యేకతలు అనేకం, అందుకే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆరు దశాబ్దాలయినా చల్లారకుండా స్వరాష్ట్రమనే ఒక మజిలీకి చేరింది. సర్వసాధారణమైన కుల, జెండర్, మైనారిటీ, పర్యావరణ తదితర అస్తిత్వాలు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వంలో కలిసి విశిష్టంగా వ్యక్తమవుతున్నాయి. అంతర్గత వలసాధిపత్యం నుండి తెలంగాణ విముక్తి, మరికొన్ని పీడిత అస్తిత్వాల విముక్తికి మార్గం సుగమం చేస్తాయి. చేయాలి కూడా.
సాహిత్య, సాంస్కృతిక కళారంగాల్లో ఆ అస్తిత్వ ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?
రాజులకు కవిత్వాన్ని అంకితమివ్వకుండా పాల్కురికి సోమ న్న నుండి మొదలైన తిరుగుబాటు సాహిత్యం, ఇక్కడి ప్రజా విప్లవ పోరాటాలతో ముడివేసుకుని ధిక్కార కవిత్వంగా, ధిక్కార సంస్కృతిగా మొదలయ్యింది. పనీ పాట అనే క్రమం లో అది పనితోనూ, ఉద్యమాలతోనూ పెనవేసుకుని ఉంది. జానపదుల నోటి నుండి సర్వాయి పాపన్న, పండుగల సాయన్నల తిరుగుబాటు చరిత్రను సంగ్రహించడం అంటే దాని విస్తృతి అర్థమవుతుంది. పని-పాట అంటే కేవలం శ్రమ గానం మాత్రమే కాదు, అది జన జీవన సంస్కృతి. దా నికి పునాది ఆర్థిక, -సామాజిక రంగాలే, ఇది చిన్న రైతు ఉత్పత్తి నుండి పురుడుబోసుకుని భూమితో, గ్రామ దేవతల (Village Deity) ఆరాధనతో ముడిపడి ఉంటుంది. అందుకే భూమి పంపిణీ, స్త్రీ సమానత్వం అనేవి కేంద్ర బిందువులు కావడం ద్వారానే తెలంగాణ ప్రజా ప్రయోజనం నెరవేరిన ట్లు అవుతుంది. సాహిత్య, -సాంస్కృతిక రంగాల విస్తృతి తెలంగాణ సమాజమంతా విశాలమైంది. ఇదే తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చడం జరిగింది. శ్రామిక జన ప్రయోజనాల మౌలిక మార్పుల దిశగా ముడి వేసుకోవడమే నేటి అవసరం.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరికిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అనేక కొత్త ఆలోచనలతో నూతన ఉత్పత్తులు, కొత్త కొత్త కళాత్మక ఆవిష్కరణలు, సాహిత్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధికి రాజకీయ అవకాశం లభించింది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇలాంటి మేథో మధనం జరగనే లేదు.