దుబాయ్: ఆసియా కప్‌లో 2025లో భారత్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పోరులో పాక్‌పై 5 వికెట్ల తేడా విజయం సాధించింది. తిలక్ వర్మ(69), శివం ధూబె(33) బ్యాట్‌తో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు గింగిరాలు తిరిగే బంతులతో కుల్‌దీప్(4/30) పాక్‌ను తిప్పేయగా.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. క్రికెట్ మైదానంలో కూడా ఆపరేషన్ సిందూరు కనిపించిందని పిఎం నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రధాని తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒకటే ఫలితం వచ్చిందన్నారు. ఆసియాక్ కప్ ఫైనల్‌లో పాక్‌పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశారు.
ఆసియాక్ కప్ ఫైనల్‌లో పాక్‌పై ఇండియా గెలిచిందని, టీమిండియా క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్టు చేశా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఆసియాక్ కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా భారత జట్టు తన అధిపత్యాని ప్రదర్శించిందని ముర్మూ ప్రశంసించారు. ఫైనల్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక వర్మ తెలంగాణ గొప్ప పేరు తీసుకొచ్చారని సిఎం రేవంత్ కొనియాడారు. అద్భుతమైన టీమ్ వర్క్, డెడికేషన్, ఆత్మవిశ్వాసంతో పాక్‌పై విజయం సాధించారని చంద్రబాబు మెచ్చుకున్నారు.