రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
అంబర్‌పేటలో మినీ సెక్రటేరియట్ నిర్మాణం
బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామనీ, చెరువులను విడిపిస్తామనీ, చెరువులను చేరబడితే తాట తీస్తామనీ, చెరువుల పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. అన్ని వసతులతో కూడుకున్న ఒక క్యాంపస్‌ని ఒక మినీ సెక్రటేరియట్‌ను అంబర్‌పేట్‌లో మీకు కట్టిచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంత ప్రజలకు అవసరమైన ఏమేం కావాలో అన్ని ఆలోచించండి. వాటికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తే డిసెంబర్ 9 తారీకు లోపల అనుమతులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి ఏర్పాటు చేస్తున్న ఎస్‌టిపిలను, హైడ్రా పునరుద్దరించిన బతుకమ్మకుంటను ఆదివారం ప్రారంభించిన సిఎం.. బతుకమ్మకుంట వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..ఏ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నాగరికత పరిణవిల్లుతుంది. ఏ ప్రాంతంలో నదులు ఉంటాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఉంటుంది. ఆ నదులను ఇయ్యాల చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న కొంతమంది కబ్జాకోర్‌ల.. భరతం ప్రభుత్వం పడుతుందన్నారు. ఎమ్మెల్యే వెంకటేష్‌కు సూచన చేస్తున్న రాజకీయాలకతీతంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. క్షేత్రస్థాయిలో మీరు సహకరిస్తే నూటికి నూరు శాతం అద్భుతాలు చేస్తాం అంటూ సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు బతకడానికి వలస వచ్చారు. జీవనాధారం కోసం ఎక్కడ దిక్కులేక ఎక్కడ నివాసము స్థలం దొరక్క ఈరోజు మూసీ నాది ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ పేదరికం నాకు తెలువదా కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు, ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే జీవితాంతం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ టీవీ కావచ్చు, మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు కావచ్చు మీరు సంపాదించుకొన్న రెండు మూడు నెలల కష్టం కావచ్చు.. ఇంట్ల పెట్టుకుంటే రాత్రికిరాత్రి ఈ రకంగా వర్షాలు వస్తే గంటలలో మీ పరిస్థితి మారిపోతుందని సిఎం రేవత్‌రెడ్డి తెలిపారు.
ఇళ్లు కోల్పోయినవారికి శాశ్వత నివాసాలు..
నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదల్చుకున్న. ఈ ప్రభుత్వ స్థలాలను మీకు అమ్మితే అడ్వాన్స్ అకౌంట్‌లోకి వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుద్దరణ కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతారో వాళ్లందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు వచ్చిన వర్షానికి హైదరాబాద్ నగరంలో వేలాది మంది చచ్చిపోయిన ఆనాటి ప్రభువు నిజాం ప్రభువు అది చూసి ఆ భాదను భరించలేక అప్పటికప్పుడు ఆలోచన చేసి ప్రపంచ స్థాయిలో సాంకేతిక నిప్పులను రప్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఒక బాధ్యత నా నగరంలో మళ్లీ ఎప్పుడు వరదలు రావద్దు నా నగర ప్రజలని కాపాడుకోవడానికి నేనేం చేయాలంటే ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రణాళికనే ఈ మూసి నాది పరివాహక ప్రాంతం యొక్క అభివృద్ధి పైన కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్‌లనీ, వికారాబాద్ అడవుల్లో నుంచి రంగారెడ్డి జిల్లాలో మొదలైన ఈ నది ఒకప్పుడు నీటి ప్రవాహంతోనే కళకళలాడేది. కానీ కాలక్రమేనా మురికి కూపంగా మారిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
బతుకమ్మకుంటకు హన్మంతరావు పేరు..
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచన మేరకు బతుకమ్మ కుంటకు డి హనుమంతరావు పేరు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని ప్రభాకర్‌కు చెప్తున్నా.. వారు చెప్పబట్టే ప్రగతి భవన్ కి జ్యోతిరావుపూలే పేరు పెట్టుకోవడం జరిగింది. హనుమంతరావు సూచన మేరకే ఇవాళ 42శాతం రిజర్వేషన్ల విషయంలో వారి అనుభవాన్ని ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుంది. వారి గౌరవానికి భంగం కలగకుండా ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్తాం అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.