ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ
రాణించిన కుల్‌దీప్.. పాక్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
ఆసియా కప్‌లో దాయాదిపై హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా
దుబాయ్: ఆసియా కప్‌లో 2025లో భారత్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పోరులో పాక్‌పై 5 వికెట్ల తేడా విజయం సాధించింది. తిలక్ వర్మ(69), శివం ధూబె(33) బ్యాట్‌తో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది. అంతకుముందు గింగిరాలు తిరిగే బంతులతో కుల్‌దీప్(4/30) పాక్‌ను తిప్పేయగా.. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. దాంతో పాకిస్థాన్ పూర్తి ఓవర్లు ఆడకుండానే 19.1 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది.పాక్ బ్యాటర్లలో సహిబ్జాద ఫర్హాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరెవరూ రాణించలేకపోయారు. అనంరతం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కడపటి వార్తలు అందే సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాక్‌కు అదిరిపోయేఆరంభం దక్కింది. ఓపెనర్లు సహిబ్జాదా ఫర్హాన్, ఫకార్ జమాన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై ఎదురు దాడికి దిగారు. వరుణ్ చక్రవర్తీ కట్టడి చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అనంతరం ఫర్హాన్ మరింత దూకుడుగా ఆడాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అతను 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తీ బౌలింగ్‌లో సిక్స్ బాదిన ఫర్హాన్ మరుసటి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి సైమ్ అయుబ్ రాగా.. ఫకార్ జమాన్ దూకుడుగా పెంచాడు. సైమ్ అయుబ్ కూడా బౌండరీలు బాదడంతో పాకిస్థాన్ స్కోర్ బోర్డు వేగం పెరిగింది. సైమ్ అయుబ్(14)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. చెలరేగిన కుల్దీప్, బుమ్రా మరుసటి ఓవర్లోనే మహమ్మద్ హరిస్(0)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన ఫకార్ జమాన్‌ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. హుస్త్స్రన్ తలత్(1)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా సల్మాన్ అలీ అఘా(8)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ఇదేఓవర్ ఆఖరి బంతికి షాహిన్ అఫ్రిది(0) కుల్దీప్ వెనక్కు పంపాడు. హరీస్ రౌఫ్(6), మహమ్మద్ నవాజ్(6) వరుస ఓవర్లలో ఔట్ కావడంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.