రేవంత్‌రెడ్డి పుట్టిన గడ్డం నుంచే బిఆర్‌ఎస్ జైత్రయాత్ర ఆరంభం
అచ్చంపేట జన గర్జనలో కెటిఆర్ వ్యాఖ్యలు
మన తెలంగాణ/అచ్చంపేట: తెలంగాణలో ఉన్న ది బిజెపి కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని.. నల్లమల్ల పులినని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తుతో కృష్ణా నీళ్లను పాలమూరుకు రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తుంది. దాన్ని అడ్డుకునే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఆదివారం అచ్చంపేటలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అ చ్చంపేట జనగర్జన బహిరంగ సభ నిర్వహించారు.
నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు కేటీ రామారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డి రోజుకు మాట మాట్లాడుతున్నారు. ఒక రోజు పేద రైతు కుటుంబానికి చెం దిన వ్యక్తి సీఎం అయితే కేసీఆర్‌కు నచ్చడం లేదని.. మరోసారి మా తాత పోలీస్ పటేల్, మాది చాలా పెద్ద కుటుంబమని చెప్తున్నాడు. ఆయన చూస్తే అతనిలో ఒక అపరిచితుడు ఉన్నాడని అనిపిస్తుంది. పొద్దున రాము, సాయంత్రం రేమో.. ఇలా ఒక్కరోజులో రెండు విధాలుగా వ్యవహరిస్తున్నాడు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన అచ్చంపేట గడ్డ నుంచే బిఆర్‌ఎస్ జైత్రయాత్ర ఆరంభం చేస్తున్నాము. రాష్ట్ర ప్రజలు రాబోయే స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు తగిన బుద్ధి చెప్తారని నమ్మకం ఉందనీ ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై రూ. 70 వేల కోట్లు ఖర్చు చేసి ఎత్తు పెంచి.. కృష్ణా జలాలను కిందికి రా కుండా కుట్ర చేస్తుంది. దీనివలన పాలమూరు, నల్గొండకు నీళ్లు రాకుండా అడ్డుకుంటే సీఎం ఏం చేస్తున్నాడని నిలదీశారు.
ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన హామీల బకాయి గురించి. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంచబోతున్నామని తెలిపారు. కేవలం మహాలక్ష్మి పథక కింద ఒక్కో ఆడబిడ్డకు రూ. 55 వేల బకాయి ఉందన్నారు. రైతుబంధు కెసిఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు.. రేవంత్ రెడ్డి ఉంటే ఓట్లు పడుతుందని ఆరోపించారు.
ఢిల్లీలోని కేంద్ర ప్రభు త్వం తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దొంగలా చూస్తున్నాడని రేవంత్‌రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నా డు. దొంగను దొంగలను చూస్తారు. ఓటుకు నో టు కేసులో రూ.50 లక్షలతో దొరికిన దొంగను దొంగలా చూడకుండా మరి ఎలా చూస్తారు. చెప్పులు ఎత్తుకుపోతాడని ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇవ్వడం లేదమొనని చమత్కరించారు.