హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. 783 పోస్టులకు గాను 782 మంది ఎంకయ్యారు. ఒక పోస్ట్ మాత్రం భర్తీ కాలేదు. గ్రూప్-2 అబ్బాయిలలో 1.హర్ష వర్ధన్, 2.సచిన్, 3.మనోహర్ రామ్, 4.శ్రీరామ మధు, 5.ప్రితం రెడ్డి టాపర్స్‌లో నిలవగా.. అమ్మాయిలలో 1.వినిషా రెడ్డి, 2.సుస్మిత, 3.శ్రీవేణి, 4.శ్రీలత, 5.స్నేహ నిలిచారు.
గ్రూప్-2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ 29న టిజివిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు… దాదాపు నెలరోజుల పాటు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు.