హైదరాబాద్: ప్రపంచం మొత్తం భవిష్యత్తు నగరం వైపు చూస్తోందని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహా అద్భతంగా మారే
నగరంగా ఫ్యూచర్ సిటి రూపుదిద్దుకోబోతుందని అన్నారు. ఫ్యూచర్ సిటి డెవలప్ మెంట్ అథారిటీ భవనానికి సిఎం శంకుస్థాపన చేశారు.
రావిర్యాల- ఆమన్ గల్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 సిఎం భూమి పూజ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు
చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతతో ఫ్యూచర్ సిటి కార్యక్రమం
చేయబోతున్నామని, భవిష్యత్తులో ఫ్యూచర్ సిటి ప్రపంచానికే తలమానికం కాబోతుందని తెలియజేశారు. అద్భుతమైన వైద్య,
విద్యాసంస్థలు, పరిశ్రమలు రాబోతున్నాయని, గొప్ప సంకల్పబలంతో ఫ్యూచర్ సిటిని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు.
అందరూ భాగస్వాములై ఫ్యూచర్ సిటి నిర్మాణానికి సహకరించాలని, భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటిలోనే ఉందని భట్టి విక్రామార్క స్పష్టం
చేశారు.