ఢిల్లీ: దేశవ్యాప్తంగా నారీ శక్తికి నిదర్శనంగా ఉత్సవాలు నిర్వహిస్తారని భారత్ ప్రధాని మంత్రి నరేంద్రమోడీ తెలిపారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా శక్తి ఉపాసన చేస్తారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభ చాటుతున్నారని,సముద్రంలో ఇద్దరు మహిళలు 8 నెలలపాటు 50 వేల. కి.మి యాత్ర చేశారని కొనియాడారు. ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు దిల్ నా, రూప ధైర్య సాహసాలు ప్రదర్శించారని, ప్రసిద్ధ భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, గాయని లతా మంగేశ్వర్ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ ఉరి కంబం ఎక్కారని నరేంద్ర మోడీ ఆవేదనను వ్యక్తం చేశారు.