మన తెలంగాణ/మోత్కూరు: మదర్ డైరీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు డైరెక్టర్లు గా గెలుపొందడంతో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్ల మోత్కూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంపై రైతులు వ్యతిరేకంగా ఉన్నారడానికి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే నిదర్శనమన్నారు. మోత్కూరు మండలానికి చెందిన రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి రెండో సారీ మదర్ డైరీ డైరెక్టర్ గా గెలుపొందడం తో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, పట్టణ అధ్యక్షులు జంగ శ్రీను, అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, మర్రి అనిల్,మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేశ్, సింగిల్ విండో డైరెక్టర్లు పురుగుల మల్లయ్య, సామ పద్మారెడ్డి, డివిఎంసి మెంబర్ దాసరి తిరుమలేశ్, నాయకులు మంచే గోవర్ధన్, సిహెచ్ సత్యం గౌడ్, కోక బిక్షం, పర్రెపాటి బిక్షం, యలగందుల అమరేందర్, ముశిపట్ల మచ్చగిరి, కనుకు రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జిట్ట సాయి కుమార్, అన్నందాసు విద్యా సాగర్, మందుల కిరణ్, మొరిగల శ్రీను, కూరెళ్ళ రమేష్, దాసరి నవీన్ కుమార్, చుక్క అశోక్, బందేల శ్రీను, చుక్క వెంకన్న, కూరెళ్ళ నాగరాజు, కూరెళ్ళ శ్రీశైలం, చెడిపల్లి ఆనంద్, ఎండి ఆలిమొద్దిను, కూరెళ్ళ సైదులు, కన్నెబోయిన లింగం, బోడిగే శ్రీను, అన్నందాసు మచ్చగిరి, బుర్ర వెంకన్న, దండ్ల కల్యాణ్, దాసరి నరేష్, వీరస్వామి, వేంపల్ల నర్సిరెడ్డి, సతీష్,బట్టు నరేష్, కన్నెబోయిన గిరి, దాసరి ఎలేందర్, దండ్ల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు