తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడి ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు సహా 31 మంది మరణించారు. సుమారు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.