అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై కాల్పుల దాడి: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు September 25, 2025 by admin టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై బుధవారం ఒక స్నైపర్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పులకు తెగబడిన వ్యక్తి తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు.