మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేస్తామన్టి రెవెన్యూ, గృహనిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశా రు. బుధవారం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక ఎంఎల్‌ఎ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయ న విస్తృ్తతంగా పర్యటించారు. సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్ర ధాన బిటి రహదారి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులై న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడి సొంతింటి కలను ఈ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఇప్పటికే తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారులు నిర్మించుకునే ఇంటి స్థాయిని బట్టి ప్ర తి సోమవారం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు.
అడవుల సంరక్షణ, అభివృద్ధిలో వన సంరక్షణ సమితుల (విఎస్‌ఎస్) పాత్ర కీలకమని అన్నారు. కల్లూరు మండల పరిషత్ ఆవరణలో నూతనంగా నిర్మించిన విఎస్‌ఎస్ సమావేశ మందిరాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కనకగిరి, పులిగుండాల అటవీ ప్రాంతం సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు దీటుగా వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అడవులను కాపాడుకుంటూనే, స్థానిక గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా ఎకో-టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వన సంరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పులిగుండాల విహార యాత్ర కోసం రెండు వాహనాలను ప్రారంభించి, సమితి సభ్యులకు కుటీర పరిశ్రమల యూనిట్లను అందజేశారు.
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి ్డ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్లూరు మండలం, పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారుల పనితీరును ప్రశ్నించారు. ప్రహరీ సహా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ రెండు నెలల్లోగా పూర్తి కావాలని, నిర్లక్ష్యం వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. తాను మళ్లీ వచ్చేసరికి పనులు పూర్తికావాలని గడువు విధించారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెంచేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోజిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎసిపి వసుంధర యాదవ్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ యాకుబ్, పిఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీరజ ప్రభాకర్, తహసీల్దార్ సాంబశివుడు, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు స్దానిక నాయకులు పాల్గొన్నారు.