న్యూఢిల్లీ : ఢిల్లీ లోని కర్తవ్యపథ్ లో వచ్చే ఏడాది జనవరి26న నిర్వహించనున్న గణతంత్రదినోత్సవ వేడుకల కవాతులో ఈసారి ఓ అరుదైన కంటింజెంట్ చేరనుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్‌ను తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్పా విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నామని అధికారులు తెలిపారు. దేశం లోనే అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే బాక్ట్రియన్ జాతికి చెందిన రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు, పది స్వదేశీ జాతి ఆర్మీకి చెందిన జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు ఈ బృందంలో ఉన్నాయి.