మాస్ మహారాజా రవితేజ… కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు.
’భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి వామ్మో వాయ్యో సాంగ్ జనవరి 2న వరంగల్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ మాస్ ఎనర్జీ అదిరిపోయింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్‌లో మాస్ అండ్ స్టైలిష్‌గా డాన్స్ చేస్తూ కనిపించిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్‌ని సెట్ చేసింది.
సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఫస్ట్ బీట్ నుంచే పండుగ జోష్‌ను తెరపైకి తీసుకొచ్చింది. రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, స్వాగ్‌తో మైమరపించారు. ఆషికా రంగనాథ్, డింపుల్ గ్లామర్‌తో పాటు గ్రేస్‌ఫుల్ డాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.