సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల అపారెల్ పార్క్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అపారెల్ పార్క్‌లో తమ హయాంలో వచ్చిన రెండు కంపెనీలు మినహా ఇప్పటివరకూ కొత్తగా ఒకటి కూడా రాలేదని అన్నారు.
‘‘25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పార్క్ ఏర్పాటు చేశాం. సంక్రాంతి లోపు వర్కర్ టూ ఓనర్ పథకం లబ్ధిదారులను ప్రకటించాలి.. లేదంటే 10 వేల మందితో నిరసన కార్యక్రమం చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంది. రూ.400 కోట్లతో అపారెల్ పార్క్ ఏర్పాటు చేసింది మేమే.. ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని కెటిఆర్ అన్నారు.