రంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం మొయినాబాద్ మండలంలోని కనకమామిడి వద్ద హైదరాబాద్-బీజాపూర్ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ముందుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడిని చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి(25)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.