విల్లివాక్కం: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తనప్పల్లి సమీపంలో లాలిక్కల్ గ్రామంలో ఓ ప్రైవేటు మహిళ వసతి గృహం ఉంది. ఇందులోని స్నానపు గదిలో రహస్య కెమెరా ఆమర్చిన కేసులో అక్కడే ఉంటున్న ఒడిశాకు చెందిన నీలుకుమారి గుప్తా(22). పంజాబ్‌కి చెందిన ఆమె ప్రియుడు రవి ప్రతాప్ సింగ్(29)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పి తంగదురై కలెక్టరుకు సిఫారుసు చేశారు. ఆ మేరకు కలెక్టర్ దినేష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రవిప్రతాప్ సింగ్‌ను వేలం సెంట్రల్ జైలుకి, నీలుకుమారి గుప్తాను కోవై మహిళ జైలుకు తరలించారు.