బ్రిస్బేన్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 54 ఏళ్ల మార్టిన్ మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతను బ్రిస్బేన్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. అతడికి డాక్టర్లు మత్తు మందు ఇచ్చి తాత్కాలికంగా కోమాలోకి పంపించారు. మెనింజైటిస్ వల్ల మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు కోమాలోకి పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే మరికొన్ని రోజుల్లో మార్టిన్‌ను కోమా నుంచి బయటకు తీసుకువస్తారని ఆస్ట్రేలియా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మార్టిన్ త్వరగా కోలుకోవాలని ఆసీస్ మాజీలు డారెన్ లెహమన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ కోరుకున్నారు. డామియన్ మార్టిన్ ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టి-20లు ఆడాడు.