హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరక్షన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా టైటిల్‌ని ప్ర కటిస్తూ.. ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీంతో పాటు స్పెషల్ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ కోసం రాజమౌళి మరియు ఆయన టీం ఎంతో కష్టపడ్డారు. 20 రోజుల పాటు ఏర్పాటు కొనసాగాయి. 1000 మందికి పైగా వర్కర్లు 24 గంటల పాటు శ్రమించారు. ఇండియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎల్‌ఇడిలు తీసుకొచ్చి ప్రత్యేకంగా 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుగా భారీ స్క్రీన్‌ని నిర్మించారు. శృతి హాసన్ డ్యాన్స్ పెర్ఫామెన్స్, పృథీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు తదితరుల ఎంట్రీలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు రాజమౌళీ. ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది ‘వారణాసి’ చిత్ర యూనిట్