బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు నటుడు ఇమ్మాన్యుల్. ’జబర్దస్త్’తో కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్న ఇమ్మాన్యుల్…. బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్… అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు. ‘బిగ్ బాస్‘ తనకు ఎంతో ఇచ్చాడని అన్నాడు. బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానన్నాడు.