లక్నో: ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోకి సంరక్షణ కోసం వచ్చిన పని వాళ్లు యజమాని, కూతురు పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించడంతో వృద్ధుడు మృతి చెందగా కూతురు ఎముకల గూడుగా మారింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహోబా జిల్లాకు చెందిన ఓ ప్రకాశ్ రాథోడ్(70) రైల్వేలో క్లర్క్‌గా పని చేసేవాడు. 2015లో రిటైర్డ్ అయి ఇంటి వద్దే ఉంటున్నాడు. 2015లో భార్య మరణించడంతో మానసిక వికలాంగురాలైన కూతురుతో ఉంటున్నాడు. వీళ్ల సంరక్షణ చూసుకోవడానికి రాంప్రకాశ్, రమాదేవి దంపతులను పనిలో పెట్టుకున్నారు. కుమార్తె, తండ్రి ప్రకాశ్‌ను గదిలో బంధించారు. బంధువులు ఎవరు వచ్చిన కలిసేందుకు ఇష్టపడటంలేదని చెబుతూ తిప్పి పంపించేవాళ్లు. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో వయసు మీదపడడంతో ఓంప్రకాశ్ చనిపోయాడు. బంధువులు ఇంటికి వచ్చేసరికి కూతురు, మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఓం ప్రకాశ్ శరీరం కృశించుక పోగా ఆయన కూతురు చీకటి గదిలో ఎముకల గూడుగా కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని వైద్యులు తెలిపారు. డబ్బు, ఆస్తి కోసం ఈ జంట దారుణానికి పాల్పడిందని బంధువులు పేర్కొన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.