మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ మెగా విక్టరీ మాస్‌లో వారి డైనమిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రేక్షకులను అలరించే సాంగ్స్ రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన భీమ్స్ సిసిరోలియో… పండుగ పల్స్, డ్యాన్స్- ఫ్లోర్ ఎనర్జీతో నిండిన మరో అద్భుతమైన ట్రాక్‌ను అందించారు. నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని పవర్‌ఫుల్ గాత్రంతో పాటలో ఎనర్జీ నింపారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం పక్కా మాస్ టచ్‌తో అలరించింది. స్టైలిష్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ పాటలో ఇద్దరు పవర్‌హౌస్ పర్ఫార్మర్లు అదరగొట్టారు.
చిరంజీవి, వెంకటేష్ డ్యాన్స్ మూవ్స్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను మైమరపించాయి. కోరియోగ్రాఫర్ విజయ్ పోలకి హై-వోల్టేజ్ స్టెప్పులతో పాట ఎనర్జీని మరింత పెంచారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12, 20226న సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఇది నా తొమ్మిదో సినిమా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమా స్టార్స్ ని చూస్తూ పెరిగాను. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున… ఈ నలుగురి సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది. వెంకటేష్‌తో చేశాను. బాలకృష్ణతో చేశాను. ఇప్పుడు మంచి అవకాశం మెగాస్టార్ చిరంజీవితో వచ్చింది. స్కూల్ డేస్ లో నేను ఆయన పాటలకి డ్యాన్స్ చేసేవాడిని. అలాంటి హీరో సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం రావడం, అలాగే నాకు ఇష్టమైన జానర్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ ఈ సినిమాలో ఒక స్పెషల్ కేమియో చేశారు. చిరంజీవి, వెంకటేష్ ఈ ఇద్దరు స్టార్స్‌ని ఒక ఫ్రేమ్‌లో చూడాలనేది మన డ్రీమ్. ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి, డ్యాన్స్ చాలా కాలం గుర్తు పెట్టుకుంటారు. ఈ సంక్రాంతి ప్రేక్షకులకు మరచిపోలేనిదిగా ఉంటుంది”అని అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ “తప్పకుండా ఈ పాట పెద్ద బ్లాక్‌బాస్టర్ సాంగ్ అవుతుందని మా నమ్మకం. ఈ సినిమాను అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ వవిజయ్ పోలాకి పాల్గొన్నారు.