హైదరాబాద్: ఫ్యామిలీ కోర్టులో భర్తను భార్య చితకబాదింది. విడాకుల అనంతరం భర్తపై దాడి చేస్తున్న కూడా నవ్వుతూ భర్త తన్నులు తిన్నాడు. భార్య భరణం కోసం కేసు వేసింది. తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తన తల్లి పేరు మీదకు భర్త బదలాయించాడు. తనకు ఆస్తులు లేవు అని, ఉద్యోగం లేదని, భరణం ఇవ్వలేనని కోర్టుకు భర్త తేల్చి చెప్పాడు. అతని వాదనతో కోర్టు ఏకీభవించింది. భరణం రాకుండా చేశాడని భర్తను భార్య కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.