లండన్:వచ్చే ఏడాది జరిగే పురుషుల టి20 వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ టీమ్‌ను ప్రకటించారు. స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ టీమ్‌లో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలం పాటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వరల్డ్‌కప్ కోసంఎంపిక చేసిన ఇంగ్లీష్ జట్టులో మాత్రం లివింగ్‌స్టోన్ చోటు దక్కించుకోలేక పోయాడు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి టి20 వరల్డ్‌కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో పాల్గొనే ఇంగ్లండ్ టీమ్‌కు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, ఒవర్టన్, రెహాన్ అహ్మద్, డాసన్ తదితరులకు వరల్డ్‌కప్ టీమ్ చోటు లభించింది.
జట్టు వివరాలు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, ఫిల్‌సాల్ట్, బెన్ డకెట్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, ల్యూక్‌వుడ్, జోష్ టంగ్, రెహాన్ అహ్మద్, అదిల్ రషీద్, సామ్ కరన్,జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జేమీ ఒవర్టన్.