మన తెలంగాణ / హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సం దర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీమహా విష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజాము నే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12: 05 గంటలకు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ క్తులకు అనుమతినిచ్చారు. ముందుగా ఆలయంలో ధ నుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు శా స్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏకాదశి వేడుకల శోభ
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకల శోభ సంతరించుకుంది. గురువారం రాత్రి నుంచే పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. వైష్ణవ ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత రం భక్తులకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పించారు. విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాల దర్శనార్ధం వెళుతుంటారు. మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంత రం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం భాగ్యం క ల్పించారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శనం కల్పించారు. స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్టలో స్వామి దర్శ నం కోసం భక్తులు బారీగా బారులు తీరారు. గరుడ వా హనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారు లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.
అట్టహాసంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల ఉత్త ర ద్వార దర్శనం కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం అ నంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేస్తున్నా రు. ఆలయ ఆవరణలో స్వర్ణ రథోత్సవ కార్యక్రమం భ క్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించా రు. ఉభయ దేవేరులు (శ్రీదేవి, భూదేవి)తో కలిసి శ్రీ మ లయప్ప స్వామి వారు కాంతులీనుతున్న స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగారు. గోవింద నామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ఉత్సవా లు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో దర్శన భాగ్యాన్ని పొందేందుకు తరలివచ్చారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వి స్తృత ఏర్పాట్లు చేసి భక్తులకు సురక్షితంగా సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనమయ్యేలా చర్యలు తీసుకున్నారు.
తిరుమలలో ఘనంగా శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠద్వారాలు తెరచుకున్నాయి. జనవరి 8 న రాత్రి 12 గంటల వరకు, పది రో జుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని ద ర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.